Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- గాంధీలో టిఫా స్కానింగ్ మిషన్స్ ప్రారంభం
నవతెలంగాణ- బేగంపేట్
టిఫా స్కానింగ్‌తో గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్య స్థితి తెలుసుకోవచ్చని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 2 టిఫా స్కానింగ్ మిషన్‌లను మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఫా స్కానింగ్ కోసం ప్రయివేటు ఆస్పత్రుల్లో 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూలు చేస్తారని, అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తామని చెప్పారు. రూ.20 కోట్లతో 56 టిఫా స్కానర్‌లను కొనుగోలు చేసి ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో ప్రారంభించిట్టు వివరించారు. ఈ స్కానర్‌తో గర్భంలోని శిశువు అవయ వాల ఎదుగుదలలో లోపాలు ఉంటే ముందే తీసుకుని జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఆస్పత్రులకు రోగుల వెంట వచ్చే సహాయకుల కోసం అతి తక్కువ ధరకు భోజనం అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, కార్పొరేటర్ హేమలత, ఆర్‌ఎంఓ విజయకృష్ణ, శాంతి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.