Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రానికి చెందిన 'ధవ' స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో శాటి లైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన ''పిఎస్‌ఎల్‌వీ-సి 54'' తో పాటు, హైద్రాబాద్ స్టార్టప్ కంపెనీ ధవ' స్టార్టప్ సంస్థ పంపిన ''తై బోల్ట్ 1, తై బోల్ట్ 2'' అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయ వంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా ఆయన అభి వర్ణించారు.
సీఎం 'రాజ్యాంగ' శుభాకాంక్షలు
భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26న జరుపుకునే, ''రాజ్యాంగ దినోత్సవం'' సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాం క్షలు తెలిపారు. భారతరత్న డా.బి.ఆర్ అంబే ద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత వివక్షకు అతీతంగా, దేశ పౌరులందరినీ సమానంగా పరిగణిస్తుం దని చెప్పారు. సమాఖ్య స్పూర్తిని బలోపేతం చేసే దిశగా, రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ అందించిన ఆర్టికల్ 3ను అనుసరించి తెలం గాణ రాష్ట్రం ఏర్పడింద న్నారు. ఆయన పేరును రాష్ట్ర సచివాలయా నికి పెట్టి ప్రభుత్వం ఘన నివాళి అర్పించిం దన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నామన్నారు.