Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రభుత్వ, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విద్యుత్ సంస్థల్లో ప్రమోషన్లు ఇస్తూ, బీసీ, ఓసీ ఉద్యోగులకు యాజమాన్యాలు అన్యాయం చేస్తు న్నాయని బీసీ కమిషన్‌లో రాష్ట్ర విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడెపాక కుమార స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్ విజయ కుమార్, రీజనల్ అధ్యక్షులు రాజకుమార్, ఎమ్ అశోక్‌కుమార్, మారం శ్రీని వాస్ కమిషన్‌ను కలిశారు. 2014 జూన్ 2 నుంచి ఇచ్చిన ప్రమోషన్లను సమీక్షించి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రాతినిధ్యాన్ని లెక్కించి, నష్ట పోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఇన్నాళ్లు దీన్ని అమలు చేయలేదన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అమలు పేరుతో ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తున్నారనీ, అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, మెరిట్ సీనియార్టీని తర్వాత సమీక్షిస్తామని కండిషన్ పెట్టారని చెప్పారు.