Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పాఠశాల భద్రత అంటే కేవలం సదుపాయాలు, భౌతిక భద్రతకు మాత్రమే పరిమితమై చూడకుండా విస్తృత కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పిల్లలు గౌరవంగా జీవించే, సురక్షితమైన వాతావరణంలో విద్యను పొందే అవకాశాలను కల్పించాలని సూచించారు. విద్యార్థుల రక్షణ, భద్రత కోసం చేపట్టాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని శనివారం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పిల్లలు ఎక్కువ సమయాన్ని పాఠశాలల్లోనే గడుపుతున్నందున పరిసరాలతో సహా పాఠశాల వాతావరణాన్ని సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు సురక్షితమైనదిగా, రక్షణాత్మకమైనదిగా తీర్చి దిద్దాల్సిన అవసరముందని అన్నారు. పాఠశాలల ను సురక్షితంగా ఉంచడం వల్ల పిల్లల సామాజిక, సృజనాత్మకమైన అభ్యాసాన్ని పెంపొందించే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థుల్లో అభద్రతాభావం నెలకొంటే విద్యపై సరైన దృష్టి సారించ లేకపోవడం వల్ల వారు నష్టపోయే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో పలు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటున్నా మరింత భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు విషయంలోనూ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్వేచ్ఛగా పాఠశాలకు పంపించే వాతావరణాన్ని కల్పించాలని, విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పలు భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టాలని భావించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాల లో విద్యార్థుల భద్రతకు సంబంధించి పలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గ దర్శకాలను సూచించిందనీ, వీటిని తప్పనిసరిగా పాటించేలా చూడడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుం టుందో ప్రభుత్వానికి సూచన చేయాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కమిటీ సభ్యులంద రూ రాష్ట్రంలోని పాఠశాలల్లో సుహృద్భావ వాతావర ణం నెలకొనే విధంగా విద్యార్థులు తల్లిదండ్రుల తోనూ, మేధావులతోనూ, విద్యారంగ నిపుణులతో చర్చించి తగిన సలహాలు సూచనలు ప్రభుత్వానికి అంద జేయాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపి మహేం దర్ రెడ్డి, అదనపు డీజీపీ స్వాతిలక్రా, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య, డి ఐ జి సుమతి తదితరులు పాల్గొన్నారు.