Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మిక్సోపతితో ప్రజారోగ్యానికి ఉపయోగం లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష, గౌరవ కార్యదర్శులు డాక్టర్ బీ.ఎన్.రావు, డాక్టర్ జె.విజరు రావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) అమలు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిక్సోపతిని ప్రోత్సహించే విధానాలు తీసుకురావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఐఎంఏ డాక్టర్లతో సమావేశం నిర్వహించిందనీ, అదే విధంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులతోనూ చర్చించిందని తెలిపారు.