Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుడి పట్టాభూమిపై కన్నేసిన ఆగ్రకుల పెద్దలు
నవతెలంగాణ-వేల్పూర్
దళితుడి పట్టా భూమిపై కన్నేసిన అగ్రకుల పెద్దలు.. ఆ భూమిని ఉచితంగా ఇస్తేనే ఆ కుటుంబానికి ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తామని కొర్రీ పెట్టింది. అందుకు దళిత రైతు ససేమిరా అనడంతో కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తూ హుకుం జారీ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు ఇసపల్లి రవి ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇసపల్లి రవి వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. కాగా, శివాలయంలో మొక్కు తీర్చుకోవడానికి వచ్చిన రవిని.. గ్రామంలోని అగ్ర కులానికి చెందిన కొందరు వచ్చి.. అడ్డుకొని శివారులో ఉన్న సర్వే నెంబర్ 333లోని ఒకటిన్నర ఎకరాల పట్టా భూమిని ఉచితంగా ఇవ్వాలని, లేకపోతే ఆలయంలోకి ప్రవేశం లేదని అడ్డుకున్నారు.