Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచంలోనే అత్యంత గొప్పగా పేర్కొనబడిన భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందనీ, దాన్ని తిరగరాసే పనిలో బీజేపీ ఉందని బీఎస్పీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం హైదరాబాద్లోని ఫోరం ఫర్ కానిస్టిట్యూషనల్ రైట్స్ ఆధ్వర్యంలో 'రాజ్యాంగం, ఎన్నికలు' అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలనలో రాజ్యాంగబద్ధమైన సంస్థలు ప్రమాదంలో పడ్డాయని ఆరోపించారు. న్యాయవ్యవస్థలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. ప్రధాన ఎన్నికల అధికారి నియామకంపై కూడా అవినీతి జరగడం చూస్తుంటే రాజ్యాంగం ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతుందని తెలిపారు. మరోపక్క దేశంలో మరో రాజ్యాంగం రాసే పనిలో బీజేపీి బిజీగా ఉందని ఆరోపించారు.