Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్త నిరసనలకు ఐద్వా పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు అర్థరహితమనీ, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన రాందేవ్‌బాబా చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఐద్వా శ్రేణులకు పిలుపునిచ్చారు.ఇటీవల కాలంలో కొందరు మహిలపై అనుచిత వ్యాఖ్యానాలు చేయటం పరిపాటిగా మారుతున్నదని తెలిపారు. రాజ్యాంగం స్త్రీపురుషులకు సమాన హక్కులు ,సమాన అవకాశాలు కల్పించిందనీ, నచ్చిన పద్ధతిలో జీవించే హక్కును ప్రసాదించిందని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికే భిన్నంగా మనువాద విధానాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పేర్కొన్నారు. మహిళలపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.