Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు ఆస్పత్రుల్లో సీ సెక్షన్లను తగ్గించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ హైటెక్స్ లో నిర్వహించిన మిసెస్ మామ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 44 శాతం, ప్రయివేటు ఆస్పత్రుల్లో 77 శాతం జరుగుతున్నాయని తెలిపారు. సి సెక్షన్లు తగ్గించేందుకు డాక్టర్ శిల్పారెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. అనవసర సిజేరియన్లతో భవిష్యత్తులో తల్లికి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు.