Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఐ ఉత్తరాఖండ్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునిత్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు సరళతరమైన పారిశ్రామిక విధానాలతోనే వాణిజ్యానికి డిమాండ్ పెరుగుతుందని ఉత్తరాఖండ్ ఆర్టీఐ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునిత్ అన్నారు. హైదరాబాద్లో డిజిటల్ రంగానికి చెందిన శ్రీను టెక్నాలజీ కంపెనీ మొదటి వార్షికోత్సవంలో ఆయనతో పాటు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్, గాంధీ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ కృష్ణ, చార్టెట్ అకౌంటెంట్ సదాశివరెడ్డి, వ్యాపారవేత్త కె.ఇ.హరిబాబు, శ్రీను టెక్నాలజీ ఎండీ చిల్కా కావ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ 2030లో భారతదేశం ప్రపంచంలోనే మూడో ఆర్థిక దేశంగా, 2050లో రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎ.ఆర్.సుకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తు టెక్నాలజీదేనన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ రాబోయే రోజులు ఎలక్ట్రానిక్స్ డివైస్ ద్వారా వచ్చే సమాచారంపైన ఆధారపడి ఉంటుందని తెలిపారు.