Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
యూనివర్సిటీల్లో నాన్‌టీచింగ్ స్టాఫ్ సమస్యలపై ఐక్యంగా ఉద్యమించాలని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ (టైమ్ స్కేల్, ఎన్ఎంఆర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీవేజ్ తదితర) సమస్యలను పరిష్కరించి పర్మినెంట్ చేయాలనీ, సమాన పనికి - సమాన వేతనం చెల్లించాలనీ, పనిభారం తగ్గించాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోస్టల్ ఆఫీస్‌లో రాష్ట్ర సన్నాహక సమావేశం జరిగింది. తమ న్యాయమైన సమస్యలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర కమిటీ తరఫున మెమోరాండం ఇవ్వాలనీ, 2022 డిశెంబర్ చివరి వారంలో రాష్ట్ర మహాసభ జరపాలని తీర్మానించారు. రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి పద్మశ్రీ అధ్యక్షత వహించగా హైదరాబాద్ నుంచి జె. కుమారస్వామి, మహేందర్‌లు పాల్గొన్నారు. వివిధ యూనివర్సిటీల నుంచి ముఖ్యమైన నాయకులు మెట్టు రవి, సలార్, అమీద్, యాకుబ్, సతీష్, శ్రీను పాల్గొని ప్రసంగించారు.