Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సునితా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళలు సర్వతోముఖాభివద్ధి చెందినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుం దని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునితా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్‌లోని సర్దార్ పటేల్ కళాశాలలో విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ అధ్యక్షతన ఉమెన్ ఇన్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏ దేశంలోనైతే స్త్రీ ఆర్థిక, రాజకీయ, సామాజిక స్వావలంబన కలిగి ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు. జనాభా లో 50 శాతంగా ఉన్న మహిళలకు ఆ స్థాయిలో అవకాశాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మహిళల్లో 43 శాతం సైన్స్ రంగంలో పట్టా పొందినప్పటికీ కేవలం 14 శాతం మంది మహిళలు సైన్స్ రంగం ఎంచుకుంటు న్నారని తెలిపారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణకుమారి, షణ్ముఖ జ్యోతి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎన్.హేమలత, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు.