Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటికే.. 31 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం.
- మరో 2.82 లక్షల కుటుంబాలకు ప్రయోజనం.
- 2021-22 లో రూ.3, 100 కోట్లు
- 2022 -23 లో రూ.17, 700 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో -హైదరాబాద్
దళిత బంధు దేశానికి ఆదర్శమని ఇప్పటికే 31వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరిందని సమాచార పౌరసంబంధాల కమిషనర్ అర్వంద్కుమార్ తెలిపారు. బ్యాంకు లింకేజీ లేకుండా...... వంద శాతం గ్రాంటుగా ప్రతి అర్హత గల కుటుంబానికి రూ.10 లక్షల సహయాన్ని అందించే పథకం దేశానికే ఆదర్భంగా ఉందని పేర్కొన్నారు. దశబ్దాలుగా సాంప్రదాయక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ సీఎం కేసీఆర్ వినూత్నం గా ఆలోసించి చేస్తున్న గొప్ప పథకం దళిత బంధు. ఇది 2021-22 లోఈ పథకం ప్రారంభమైంది. లబ్దిదారుని బ్యాంకు అకౌంటుకు నేరుగా సహాయాన్ని జమ చేస్తారు. దళిత బంధు రక్షణ నిధిని ఏర్పాటు చేసి, ఆపద సమయంలో ఆదుకొనేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం బలోపేతం చేసింది. దళిత బంధు లబ్దిదారుడు రూ.10 వేలను జమచేస్తే.. మరో రూ.10 వేలను ప్రభుత్వం తన వాటాగా ఈ నిధికి సమకూర్చుతోంది. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జూలై, 2021 లో సాచురేషన్ మోడ్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సహాయం అందించారు. ఫలితంగా దళితులు అనేక స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. ఇప్పటి వరకు 15,402 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలిగింది. 2021-22 ఆర్థిక సంవ త్సరంలో దళితబంధును రాష్ట్రంలోని 118 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 100 కుటుంబాల చొప్పున, 11,800 కుటుంబాలకు ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 10,803 మంది లబ్దిదారులకు సహాయం రూ.3,100కోట్లు మంజూరు చేశారు. 2022-23 లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1500 యూనిట్ల ద్వారా దళిత కుటుంబాలకు రూ.17,700 కోట్లను కేటాయించింది.అంటే 2.82 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేరుకున్నది. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ కార్యాచరణ రూపొందించారు.