Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో 13 మంది కాలేజీ ప్రిన్సిపాళ్లు, సిబ్బందిని కూడా..
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు, అల్లుడితో పాటు వారి కాలేజీలకు చెందిన పదమూడు మంది ప్రిన్సిపాళ్లు, ఇతర కార్యాలయ సిబ్బందిని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖాధికారులు సోమవారం విచారించారు. ఇటీవలనే మల్లారెడ్డి, ఆయన కుటుంబీకులకు చెందిన ఇంజినీరింగ్, వైద్య కళాశాలలతో పాటు వారి నివాసాల్లో ఐటీ అధికారులు రెండ్రోజుల పాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున సాగిన ఈ సోదాల్లో మల్లారెడ్డి అల్లుడితో పాటు బంధువుల ఇండ్ల నుంచి రూ. 10.50 కోట్లను స్వాధీనపర్చుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, పన్ను ఎగవేతకు సంబంధించి తదుపరి విచారణకు హాజరు కావాలని తెలిపిన ఐటీ అధికారులు.. మల్లారెడ్డి మొద లుకొని ఇతర కుటుంబసభ్యులు, బంధువులకు నోటీసులను జారీ చేశారు. ఈ మేరకు సోమవారం మంత్రి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి లతో పాటు వారి కాలేజీలకు చెందిన పదమూడు మంది ప్రిన్సిపాళ్లు, వారి కార్యాలయాల అధికారులు ఐటీ ఆఫీసర్ల ఎదుట హాజరయ్యారు.