Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులను పరిశీలించిన తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్‌సాగర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని పిల్లలు, ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు రూ.42 కోట్లతో నాచారంలో కొత్త ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టినట్టు తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్‌సాగర్ తెలిపారు.
సోమవారంనాడాయన క్షేత్రస్థాయిలో ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పిల్లల కోసం బాలామతం వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని ఉత్పత్తి ఇక్కడ చేస్తామన్నారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫ్లాంట్ 1975 సంవత్సరంలో నిర్మించిందనీ, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో, గంటకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కొత్త ప్లాంట్ ద్వారా జరుగుతుందన్నారు.
ఫ్యాక్టరీ జీఎం విజయలక్ష్మీ, హెచ్ఆర్ మేనేజర్ కష్ణవేణి, వర్క్స్ శ్రీనివాస్ నాయక్, ప్రాసెస్ మేనేజర్ ఏలమంద, పర్చేజ్ మేనేజర్ వెంకటయ్య, డెప్యూటీ మేనేజర్లు కోటేశ్వరావు, బాబు తదితరులు పాల్గొన్నారు.