Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడైన నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ వ్యవహారానికి సంబంధించి అతని మీద ఆరోపణలు రావడంతో కస్టడీ కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ మేరకు చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్‌ను బంజారాహిల్స్ పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, సీఐ నరేందర్ అడ్వకేట్ సమక్షంలో విచారణ జరిగింది. మొదటి రోజు విచారణ పూర్తి చేసి తిరిగి నందకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మంగళవారం రెండో రోజు కూడా అతన్ని విచారించనున్నారు. డెక్కన్ కిచెన్ వ్యవహారంలో నందకుమార్‌పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్లు 406,420,506 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.