Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అద్భుతమైన పాలన అందిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పూలే వర్ధంతి సందర్భ ంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫూలే చేసిన సేవలను స్మరించుకు న్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికి తెలంగాణను మోడల్‌గా చేశారని కొనియాడారు. బడుగుల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, కలెక్టర్లు కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఫూలే ఆశించిన నవ నమాజ నిర్మాణానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. సామాజిక రుగ్మతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు పోతుందని పేర్కొన్నారు. సామాజిక అసమానతలు తొలగించేందుకు ఫూలే అవిశ్రాంతంగా పోరాడిన మహానీయుడనీ, ఆయన స్పూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లడమే నిజమైన నివాళి అని తెలిపారు.