Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మహాత్మా జ్యోతీబాఫూలే పేరుతో 310 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నిర్వహిస్తున్నదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఫూలే వర్థంతి సందర్భంగా బలహీనవర్గాలకోసం ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ సోమవారం మంత్రి నివాళులర్పించారు. ఫూలే ఆశయాలతో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్రంలో310 బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విదేశీ విద్యకు సంబంధించి అత్యున్నతమైన విధానాన్ని ప్రభుత్వం అవలంభిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్లో వేల కోట్ల విలువైన 87 ఏకరాలను 41 బీసీ కులాలకు కేటాయించిందని తెలిపారు.