Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, ఏఐకేఎంఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఎర్రబోడులో ఫారెస్టు అధికారి చలమల శ్రీనివాసరావు అవాంఛనీయ హత్యను సాకుగా తీసుకుని ఆ ప్రాంతం నుంచి గొత్తికోయలను వెళ్లగొట్టాలంటూ నోటీసులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, ఏఐకేఎంఎస్ విమర్శించాయి. ఈ మేరకు ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గొత్తికోయలు ఈ దేశపౌరులనీ, రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్లోని ఐదో షెడ్యూల్ ప్రకారం వారు ఎక్కడైనా జీవించే అవకాశాన్ని రాజ్యాంగాన్ని కల్పించిందని గుర్తు చేశారు. ఇది ఆధునిక పౌర సమాజం ఇచ్చిన జీవించే హక్కని తెలిపారు. వారు అత్యంత వెనుకబడిన వారు కాబట్టి వెళ్లగొట్టడం దుర్మార్గమని విమర్శించారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వారిని వెళ్లగొట్టాలనడం విడ్డూరంగా ఉందని తెలిపారు.