Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ రాకెట్ సిటీగా మారనుంది
- స్కైరూట్ ఎరోస్పేస్ కో ఫౌండర్ వెల్లడి
హైదరాబాద్ : విమాన యానం ధరలోనే అంతరిక్ష యానం అందుబాటులోకి రావడానికి ఇంకా ఎంతో దూరం లేదని స్కైరూట్ ఎరోస్పేస్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. ఇటీవల ఈ సంస్థ దేశంలోని తొలి ప్రయివేటు రాకెట్‌ను రూపొందించి వార్తల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వచ్చే పదేళ్లలో భారత పర్యాటకులు కూడా అంతరిక్షయానం చేయడానికి వీలుందని పవన్ కుమార్ పేర్కొన్నారు. భారత రాకెట్ సిటీగా హైదరాబాద్ ఆవిర్బవించనుందన్నారు. సోమవారం నగరంలో ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ) ఏర్పాటు చేసిన ఓ చర్చా సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ.. దేశీయ స్పేస్ టెక్నలాజీలో తెలుగు రాష్ట్రాల వాటా కీలకంగా ఉందన్నారు. 500 కిలోల లోపు చిన్న శాటిలైట్ల తయారీపై తాము దృష్టి కేంద్రీకరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పాలసీ బజార్ సహ వ్యవస్థాపకులు అలోక్ బన్సల్, రాపిడో సహ వ్యవస్థాపకులు పవన్ గుంటుపల్లి, ఎఫ్ఎల్ఒ హైదరాబాద్ ఛైర్పర్సన్ సుబ్రా మహేశ్వరి పాల్గొని మాట్లాడారు.