Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌరవాధ్యక్షులుగా పాలడుగు భాస్కర్
- 82 మందితో రాష్ట్ర కమిటీ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా గ్యార పాండు, చాగంటి వెంకటయ్య, గౌరవాధ్యక్షులుగా పాలడుగు భాస్కర్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా పైళ్ల గణపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 26,27 తేదీల్లో ఆ యూనియన్ రాష్ట్ర మహాసభలు జరిగిన విషయం తెలిసిందే. అందులో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోశాధికారిగా గడ్డం ఈశ్వర్, ఉపాధ్యక్షులుగా ఎం.రాజలింగు, బత్తుల వెంకటేశ్వర్లు, సాయిరత్న, మాధవి, పోలె సాంబయ్య, పొట్ట యాదమ్మ, కె.నర్సమ్మ, ఎన్.శ్రీనివాస్, బి.అప్పిరెడ్డి, నారోజు రాంచందర్, రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులుగా ఎం.మల్లేశ్, మల్త్యాల నర్సయ్య, రాజేశ్వర్, వెంకటేశ్‌గౌడ్, తునికి మహేశ్, శ్రీకాంత్, పులి మల్లేశ్, నాగరాజు, ఎన్.దశరథ్, మండ్ల రాజు, కె.శంకర్, తుమ్మ మహేశ్, వినోద్, సంతోష్ ఎన్నికయ్యారు. 53 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉండనున్నారు.