Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్యాంక్‌బండ్ ఒడ్డున ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహం తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో జనరంజక పాలనను అందిస్తున్నామన్నారు. విగ్రహం అడుగు భాగంలో పార్లమెంట్ తరహా నిర్మాణాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. కింది భాగంలో అంబేద్కర్ ఫొటో గ్యాలరీతో పాటు ఆయన గొప్పతనం, జీవిత చరిత్రకు సంబంధించిన వివిధవ అంశాలు, పుస్తకాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో సినిమా థియేటర్ కూడా ఉంటుందని చెప్పారు. విగ్రహ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జన్మదిన వేడుకల సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.