Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపాలెం
ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రబోడు ఘటనలో మృతి చెందిన ఎఫ్ఆర్ఓ చలమల శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రకటించిన రూ.50 లక్షల పరిహారాన్ని అటవీశాఖ చీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్ఓ సిద్దార్థ విక్రమ్ సింగ్ చేతుల మీదుగా సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో శ్రీనివాసరావు కుటుంబసభ్యులను కలిసిన అధికారులను ఆయన భార్య, పిల్లలను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, భయపడాల్సిన అవసరం లేదని, శాఖ తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇతర అన్ని హామీలను సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మెన్ విజరు కుమార్, డీసీసీబీ చైర్మెన్ కురాకుల నాగభూషణం, ఎంపీపీ భూక్య గౌరి, తహసీల్దార్ జి.నర్సింహారావు, ఎఫ్ఆర్ఓ రాధిక, మంత్రి పీఏ సిహెచ్.రవికిరణ్, నాయకులు మందడపు నర్సింహారావు, కుర్రా భాస్కర్రావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, మందడపు సుధాకర్ తదితరులు ఉన్నారు.