Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎస్ఆర్టీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రేడియాగ్రాఫర్లకు మూడు నెలలకోసారి శిక్షణ ఇవ్వనున్నట్టు ఇండియన్ సొసైటీ ఆఫ్ రేడియోగ్రాఫర్స్ అండ్ టెక్నాలజిస్ట్స్ (ఐఎస్ఆర్టీ) రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రేడియోగ్రాఫర్స్ డే నిర్వహించారు. సీనియర్ రేడియాలజిస్ట్ డాక్టర్ జువ్వాడి సందీప్, రేడియోగ్రఫీలో వస్తున్న ఆధునాతన పరిజ్ఞానాన్ని వివరించారు. అనంతరం సొసైటీ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి టోనీ, కో ఆర్డినేటర్ అన్సారీలతో కలిసి మాట్లాడుతూ, రేడియోగ్రాఫర్లకు ఒక్క రోజు నిర్వహించిన శిక్షణకు మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఆ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. రోగికి చికిత్సనందించడంలో మొదటి అడుగు పరీక్షలనీ, ఆ పరీక్షలు నిర్వహించే వారు ఎంత పరిజ్ఞానం కలిగి ఉంటే చికిత్స అంత సులువవుతుందని తెలిపారు.