Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'క్రెడాయ్' పెట్టుబడుల సదస్సులో ఆర్థిక సంస్థలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రియల్ ఎస్టేట్ రంగంలో మరో పదేండ్ల పాటు హైదరాబాద్ మొదటిస్థానంలోనే కొనసాగుతుందని పలు ఆర్థిక సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ స్పేస్, గృహ సముదాయాలు సహా అన్ని రకాలుగా ఇక్కడ నివసించేందుకు అనువైన వాతా వరణం, ఆర్థిక పరిపుష్టి ఉన్నాయనీ, అందువల్ల ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షి యల్ సర్వీసెస్ సంస్థ 'అప్వైసరీ' సంయుక్తాధ్వర్యం లో హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో సోమవారం నాడిక్కడ ''రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్- 2022'' నిర్వహించారు. అప్వైజరీ వ్యవస్థాపక భాగ స్వామి అనూజ్ కపూర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మోతీలాల్ ఓస్వాల్ అల్టర్నేటివ్స్ సీఈఓ శరద్ మిట్టల్, ఆల్లర్నేటివ్ క్రెడిట్ డైరెక్టర్ అండ్ స్ట్రాటజీ హెడ్ బీ కార్తీక్ ఆత్రేయ, టిష్‌మ్యాన్ స్పేయర్ ఇండియా క్రెడిట్ హెడ్ పర్వేష్శర్మ, టాటా క్యాపిటల్ హౌసింగ్ కార్పొరేషన్ క్రెడిట్ విభాగాధిపతి బీ వైభవ్ అగర్వాల్, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు పీ రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్‌రెడ్డి తోపాటు దాదాపు 150 మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు, 20కి పైగా దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ఫండ్ మేనేజర్లు పాల్గొన్నారు. కోవిడ్ తర్వాత అత్యంత వేగంగా హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్‌రంగం వృద్ధి చెందిందనీ, మరో పదేండ్లు ఇదే ఒరవడి కొనసాగుతుందని పలు సంస్థలు అభిప్రాయ పడ్డాయి. ఆయా సంస్థల వెంచర్లలో పెట్టుబడులు, భాగస్వామ్యం అయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మూలధన వ్యయం, వడ్డీరేట్లు సమీప కాలంలో ఎక్కువగానే కొనసాగొచ్చని అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ డిమాండ్ స్ధిరంగా వద్ధి చెందుతున్నదని చెప్పారు. యాక్సిస్ ఆర్ఈ ఫండ్, జెఎం ఫైనాన్షియ ల్, క్యాపిటల్ ల్యాండ్, హీరో ఫిన్‌కార్ప్, ఆదిత్య బ్యాంక్, కొటక్ మహేంద్ర వంటి సంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. అప్ వైజరీ సంస్ధ సహ వ్యవస్థాప కులు అభిజిత్ బెనర్జీ మాట్లాడు తూ 2030 నాటికి విశ్వనగరం గా హైదరాబాద్ అభివద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నా యన్నారు. అప్వైజరీ సహ వ్యవస్థాపకులు ప్రశాంత్ మీనన్ వందన సమర్పణ చేశారు.