Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరహక్కుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆనెం చంద్రారావును వెంటనే కోర్టులో హాజరుపర్చాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్ఎస్ఎస్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు వారు మాట్లాడారు. ఈ నెల 19,20 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన భారత్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చంద్రారావును పోలీసులే కిడ్నాప్ చేశారనీ, ఇప్పటి వరకు ఆచూకీ తెలియకుండా ఉంచారని ఆరోపించారు. అతనిపై కేసులు ఏమైనా ఉంటే వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్ చేశారు. స్వేఛ్చగా తమ అభిప్రాయాలను చెప్పుకునే హక్కును తెలంగాణ ప్రభుత్వం హరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 25 భూటకపు ఎన్కౌంటర్లు, 10లాకప్‌డెత్‌లు జరిగాయని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు నిర్బంధంలేని రాష్ట్రంగా ఏర్పాటుకావాలని ఆకాంక్షిం చామని గుర్తుచేశారు. కానీ..అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయన్నారు. చంద్రారావు కిడ్నాప్‌తో తెలంగాణ ప్రభుత్వం మిస్సింగ్ కేసులకు తెరదీసిందని విమర్శించారు.