Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భైంసాలో ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభం
నవతెలంగాణ-భైంసా
రాష్టాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఏర్పాటు చేసిన 5వ విడుత ప్రజాసంగ్రామ యాత్ర బహిరంగ సభలో అయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి ఎనిమిదేండ్లు గడుస్తున్నా దాని ఊసే ఎత్తడం లేదని తెలిపారు. అదే కేంద్ర ప్రభుత్వం 75వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర భైంసా నుంచి ప్రారంభిస్తుంటే సున్నితమైన ప్రాంతమంటూ పోలీసులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. కోర్టు ఇచ్చిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంగ్రామ యాత్ర, సభను భైంసాకు 3కిలో మీటర్ల దూరంలో ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ నియంత పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భైంసా పట్టణాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పా రు. రాష్ట్రంలోని యువ కులకు ఉచిత విద్యా వైద్యం అందేలా చూస్తామన్నారు. తెలిపారు. ఇండ్లు లేని వారికి పక్కా ఇండ్లు కట్టిస్తా మన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షులు పవర్ రామారావు పటేల్ బీజేపీలో చేరారు. ఆయ నకు పార్టీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బహిరంగ సభలో ఆదిలా బాద్ ఎంపీ సోయం బాపు రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్య క్షులు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.