Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాట్ చూడటానికి వచ్చారు.. శవాలతో వెళ్లారు
- మహబూబ్‌నగర్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ- బాలానగర్
ప్లాట్‌ను చూసేందుకు సంతోషంగా పిల్లలతో కలిసి వచ్చిన తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. వచ్చేటప్పుడు కొడుకులతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన ఆ భార్యాభర్తలు పోయేటప్పుడు ఇద్దరు పిల్లల మృతదేహాలతో వెళ్లారు. ఆడుకుంటూ వెళ్లి పిల్లలు నీటి గుంటలో పడి విగతజీవులుగా మారారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దయ్యపల్లి శివారులో మంగళవారం జరిగింది ఎస్ఐ జయప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని పాలెం గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డి ఉద్యోగరీత్యా హైదరాబాద్ పటాన్‌చెరువులో నివాసం ఉంటున్నారు. బాలానగర్ మండలం పెద్దయ్యపల్లి శివారులో ప్లాట్ చూడటానికి కుటుం బంతో వచ్చారు. భార్యాభర్తలు స్థలాన్ని, పరిసరాలను చూస్తుండగా.. పిల్లలు అనూష్ పవన్‌రెడ్డి(8), యువ మనోజ్‌రెడ్డి(6) ఆడుకుంటూ వెళ్లి అక్కడే నీటి గుంటలో పడిపోయారు. అది గమనించిన తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలను వెంటనే బయటకు తీశారు. అప్పటికే ఒకరు మృతిచెందారు. మరో బాలున్ని హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆ బాలుడూ చనిపోయాడు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.