Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కందనూలు
నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్లో మంగళవారం ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాలెం గ్రామానికి చెందిన బాలిక(17)కు జిల్లా కేంద్రంలో ఉంటున్న వంశీతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. విషయం బాలిక కుటుంబీకులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. అయినా వినకపోవడంతో యువకునిపై బిజినాపల్లి మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను, యువకున్ని జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా వినకపోవడంతో యువకునిపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బాలిక మాత్రం సఖి కేంద్రంలోనే ఉండగా.. మధ్యాహ్నం సమయంలో అధికారులు భోజనం కోసం వెళ్లగా.. ఫ్యానుకు ఉరేసుకుంది. ఎస్ఐ విజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.