Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 పురస్కారం అందు కోవడం పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి 45 ఏండ్ల నట జీవితంలో ఎన్నో అత్యుత్తమ శిఖరాలు అధిరోహించారని మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో కొనియాడారు. గోవాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించినట్టు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు వారితో పాటు దేశ విదేశాల్లో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారని అన్నారు.