Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అలిండియా కిసాన్-మజ్దూర్ సభ (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను వచ్చే నెల 12న భద్రాద్రి కొత్తగూడెంలో జరగనున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని మార్స్క్భవన్లో అందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న వారి జీవితాలు హీనంగా ఉన్నాయని చెప్పారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రైతాంగ పరిస్థితులు, అందుకోసం పోరాడాల్సిన మార్గంపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి యం కృష్ణ, కార్యవర్గ సభ్యులు బి రాము, నాయకులు కొండ నర్సింహులు, రాజు, టి పుష్ప తదితరులు ఉన్నారు.