Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ హిమోఫిలియా సొసైటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రభుత్వం హీమోఫిలియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా అందజేస్తున్న ఫ్యాక్టర్ ఇంజిక్షన్లను పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో కూడా అందుబాటులో ఉంచాలని హైదరాబాద్ హీమోఫిలీయా సోసైటీ కోరింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సుభాష్ చంద్ర నేతత్వంలో నాయకులు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చుతో హీమోఫిలీయా ఫ్యాక్టర్ ఇంజక్షన్లను ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులతోపాటు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ఆయా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తుందని వారు తెలిపారు. హీమోఫిలీయా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం, శస్త్ర చికిత్సలు అందించడానికి నిమ్స్ ఆస్పత్రిలో ఆధునాతన, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వసతులతోపాటు రక్త సంబంధిత వైద్య నిపుణులు కలిగిన హీమోటాలజీ విభాగం కూడా అందుబాటులో ఉందని చెప్పారు. నిమ్స్‌లో ప్రత్యేకంగా హీమోటాలజీ వైద్య విభాగం ఉన్నందున హీమోఫిలీయా వ్యాధిగ్రస్తులు అక్కడికే వెళ్తున్నారనీ, హీమోఫిలీయా ఫ్యాక్టర్ ఇంజిక్షన్లు అందుబాటులో లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. వెంటనే సానుకూలంగా స్పందించిన హరీశ్ రావు నిమ్స్ ఆసుపత్రి ఓఎస్డీ డాక్టర్ గంగాధర్‌కు తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు వారు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సోసైటీ ప్రతినిధులు సుజాత, రామకృష్ణ తదితరులు ఉన్నారు.