Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి బలిదానం కాంగ్రెస్ చేసిన హత్యే
- ట్విట్టర్లో కాంగ్రెస్‌పై కల్వకుంట్ల కవిత ఫైర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా దివస్ సందర్భంగా కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కామెంట్లకు ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ''రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది యువకులు బలిదానం చేశారు. ప్రజా పోరాటాలను అపహాస్యం చేయడం అలవాటుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని దేశమంతా ప్రజలు తిరస్కరిస్తున్నా బుద్ధి రావడం లేదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ప్రారంభించిన కేసీఆర్, దేశంలోని 39 పార్టీల మద్దతు కూడగట్టి, యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి, తెలంగాణ రాష్ట్రం తెచ్చారు.'' అని పేర్కొన్నారు. ''సొంత నియోజకవర్గం అమేథిలో గెలుస్తానని నమ్మకం లేక రాహుల్‌గాంధీ కేరళ రాష్ట్రం వాయనాడ్ వెళ్లారు. తాను ఎంపీగా ఓడిపోయినా అక్కడే స్థానిక సంస్థల కోటాలో మీ పార్టీ పైనే ఎమ్మెల్సీకి పోటీ చేసి గెలిచా.'' అని కవిత స్పష్టం చేశారు.