Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ సాక్స్‌ల తయారీ దారు ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ లిమిటెడ్ విస్తరణ కోసం రూ.300 కోట్ల పెట్టుబడులను పెట్టను న్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ కాంట్రాక్టు సాక్స్‌ల తయారీతో పాటు సొంత బ్రాండ్లను కలిగి ఉంది. మంగళవారం హైదరాబాద్‌లో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాత్ సెతియా మీడియాతో మాట్లాడుతూ.. నగర సమీపంలోని గండి మైసమ్మ పారిశ్రామిక వాడలో గత రెండు దశాబ్దాలుగా తాము ఉత్పత్తిని కలిగి ఉన్నామన్నారు. ఇక్కడ కొత్తగా మరో 500 మిషన్లను అందుబాటులోకి తేనున్నామన్నారు.వచ్చే ఏడాదిన్నరలో విస్తరణ పూర్తి కానుందన్నారు. ప్రస్తుతం ఏడాదికి 70 లక్షల సాక్స్‌లను తయారు చేస్తున్నామన్నారు. తమ విస్తరణ పూర్తయితే ఏడాదికి ఇది 3 కోట్ల తయారీ సామర్థ్యానికి చేరనుందన్నారు. అదే విధంగా 2వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 110 కోట్ల టర్నోవర్ సాధించామని ఈ ఏడాది రూ.120 కోట్లుగా ఉండొచ్చన్నారు.