Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీస్ బలగాలతో సర్వే, తీవ్ర ఉద్రిక్తత
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
త్రిపుల్ఆర్ ఉత్తరభాగంలో జరుగుతున్న భూసేకరణ సర్వే పనుల్ని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ శివారు భూముల్లో త్రిపుల్ఆర్ రోడ్డు పనుల కోసం అధికారులు సర్వే చేశారు. సర్వే జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న గిర్మాపూర్ బాధిత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ పంట భూముల్లో సర్వే పనులు చేపట్టొద్దంటూ రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. రెండు పంటలు పండే పొలాలు, నర్సరీ తోటలున్న భూముల్లో సర్వే చేస్తుండగా రైతులు అభ్యంతరం తెలిపారు. అనుమతి లేకుండా తమ భూముల్లో సర్వే ఎలా చేస్తారంటూ నిలదీశారు. జీవనాధారమైన భూముల్లో రోడ్డు వేస్తే తమ కుటుంబాలు ఏం కావాలని సర్వే పనులు చేస్తున్న సిబ్బంది, అధికారుల్ని భూములు కోల్పోతున్న రైతులు విద్యాసాగర్, రమేష్, మహిపాల్ తదితరులు సర్వే చేయవద్దంటూ అడ్డుకున్నారు. తమకున్న 4 ఎకరాల భూమి మొత్తాన్ని రోడ్డు కోసం తీసుకుంటున్నారని, భూమంతా పోతే తమ కుటుంబాలు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అప్పటికే సర్వే జరుగుతున్న ప్రాంతంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. పోలీస్ పహారాలో జరుగుతున్న సర్వే పనుల్ని బాధిత రైతులు, వివిధ పార్టీల నాయకులు అడ్డు కోవడం, వాదో పవా దాలు చోటు చేసుకోవడంతో సర్వే జరుగుతున్న ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. సర్వే పనుల్ని అడ్డు కునేందుకు వచ్చిన రైతుల్ని కొండాపూర్, సంగారెడ్డి పట్టణ, రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఈడ్చుకుంటూ తీసు కొచ్చి వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు బందోబస్తు మధ్యన సర్వే పనుల్ని కొనసాగించారు.