Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడిటర్, సీజీఎం సంతాపం
నవతెలంగాణ- బేల
నవతెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ కొలిపాక నాందేవ్ తండ్రి కొలిపాక చిన్నన్న(70) అనా రోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లాలోని సొంత గ్రామం బేల మండలం సాంగిడిలో అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నన్న మృతికి నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, సీజీఎం ప్రభాకర్ సంతాపం తెలిపారు. చిన్నన్న భౌతికకాయాన్ని నవతెలంగాణ ఆదిలాబాద్ రీజినల్ డెస్క్ ఇన్చార్జ్ రాపర్తి దత్తాత్రి, స్టాఫ్ రిపోర్టర్ మెడపట్ల సురేష్, డివిజన్ ఇంఛార్జీలు ఉష్కం సురేష్, గోపికృష్ణ, జయరావు, సబ్ ఎడిటర్లు గాజరి మహేష్, కొండ రాజన్న, విలేకరులు, కార్యాలయ సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సీనియర్ నాయకులు లంక రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.