Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1500 అప్టో మెట్రిషన్లు, 1500 డాటా ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో 1,500 మంది ఆప్టో మెట్రిషన్లు, 1,500 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో మంత్రి డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, క్వాలిటీ బృందాలు, ప్రోగ్రాం ఆఫీసర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేసి 55 లక్షల మందికి కండ్లద్దాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. వీటిలో 30 లక్షలు రీడింగ్ గ్లాసెస్, మరో 25 లక్షలు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చించనుందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద కంటి పరీక్షల కార్యక్రమం కోసం 1,500 బృందాలు శని, ఆదివారాలు మినహా మిగిలిన ఐదు రోజులు పని చేస్తాయని చెప్పారు. 969 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల తుది జాబితా వచ్చే నెల ఒకటో తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 1,500 వాహనాలను ఈ బృందాల కోసం ప్రత్యేకం గా కేటాయించినట్టు వెల్లడించారు. రెగ్యులర్ సేవలకు ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు.
ప్రజా ప్రతినిధులను భాగ స్వాములు చేయాలనీ, జిల్లా కలెక్టర్ల సహకారం తీసు కోవాలని ఆదేశించారు. జనవరి ఐదున జిల్లా కలెక్ట ర్లు, ప్రజా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుం దని తెలిపారు. సమస్య వస్తే వినియోగించు కునేలా అదనపు బృందాలను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. జనవరి ఒకటిన రీఫ్రాక్తో మిషన్లు, కార్యక్ర మానికి ముందే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తామనీ, పరీక్షలు చేసిన తర్వాత నెల రోజుల్లో ప్రిస్కిప్షన్ అద్దా లు ఇస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో 10 క్వాలిటీ కంట్రోల్ టీమ్‌లు, జిల్లాకొక టీమ్ పని చేస్తాయన్నారు. వీరందరికి ఎల్.వీ. ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సహకారంతో రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తామని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లా డుతూ కంటి వెలుగు కార్యక్ర మానికి తమ శాఖ సంపూర్ణంగా సహకరిస్తుందని తెలిపారు.