Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షులుగా పోతినేని సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా టి.సాగర్
నవతెలంగాణ - నల్లగొండ
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. నల్లగొండలో మూడ్రోలు జరిగిన సంఘం రాష్ట్ర రెండో మహాసభ ముగింపు సందర్భంగా ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, సహాయ కార్యదర్శి విజ్జు కృష్ణన్, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి సమక్షంలో నూతన కమిటీని 87 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 మంది ఆఫీస్ బేరర్స్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా పోతినేని సుదర్శన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టి.సాగర్ తిరిగి ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులుగా జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నరసింహారెడ్డి, పి.జంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు(రాష్ట్ర కేంద్రం), కాసాని ఐలయ్య (కొత్తగూడెం), మాదినేని రమేష్ (ఖమ్మం), బుర్రి శ్రీరాములు (సూర్యాపేట), వీరేపల్లి వెంకటేశ్వర్లు (నల్లగొండ), శెట్టి వెంకన్న (మహబూబాబాద్), బి.నరసింహారెడ్డి (సంగారెడ్డి), వర్ణ వెంకటరెడ్డి (కరీంనగర్), బుస్సు మధుసూదన్ రెడ్డి (రంగారెడ్డి) ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శులుగా మూడ్ శోభన్, ఎల్.బాలకృష్ణ (రాష్ట్ర కేంద్రం), అన్నవరపు సత్యనారాయణ (భద్రాద్రి కొత్తగూడెం), బొంతు రాంబాబు (ఖమ్మం), దండ వెంకట్‌రెడ్డి (సూక్యాపేట), కున్రెడ్డి నాగిరెడ్డి (నల్లగొండ), మాటూరి బాలరాజు గౌడ్ (భువనగిరి), ఎండి గఫూర్ పాషా (ములుగు), ఈసంపల్లి బాబు (వరంగల్), శెట్టిపల్లి సత్తిరెడ్డి (సిద్దిపేట), డి.బాల్ రెడ్డి (వనపర్తి), ఎం.శ్రీనివాస్ (నాగర్ కర్నూల్), పల్లపు వెంకటేష్ (నిజామాబాద్), కందాల ప్రమీల (మహిళ), రాపర్తి సోమయ్య (జనగామ)ను ఎన్నుకున్నారు. శాశ్వత ఆహ్వానితులుగా సారంపల్లి మల్లారెడ్డి, బొంతల చంద్రరెడ్డిని ఎన్నుకున్నారు.