Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రోష్ ఫార్మా ఇండియా కొత్తగా బ్లూ ట్రీ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగమైన బ్లూ ట్రీ 2.0 మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఈ మొబైల్ అప్లికేషన్, రోగులు వివిధ రకాల పేషెంట్ సపోర్ట్ సర్వీసులను పొందడాన్ని సులభతరం చేస్తుందని.. తద్వారా వారి చికిత్సలను సులభతరం చేస్తుందని ఆ కంపెనీ యండీ, సీఈఓ వి సింప్సోన్ ఇమాన్యుల్ తెలిపారు. వైద్య సేవలతో పాటు రోగులు, వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఫండింగ్ సపోర్ట్, వడ్డీ లేని ఈఎమ్ఐలు, ఇతర సేవలను పొందవచ్చన్నారు.