Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్‌కు దాశరథి కుమారుడు లక్ష్మణ్ విజ్ఞప్తి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లాకు, కలెక్టరేట్ సముదాయానికి మహాకవి దాశరథి కష్ణమాచార్య పేరు పెట్టాలని ఆయన కుమారుడు దాశరథి లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారంనాడాయన హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేసారు. ఈసందర్బంగా దాశరథి లక్ష్మణ్ మాట్లాడుతూ 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని గర్జిస్తూ, సాహితీ రంగంలో తెలంగాణ ఖ్యాతిని దాశరథి¸ కష్ణమాచార్య విశ్వవ్యాప్తం చేశారని చెప్పారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి, స్వాతంత్య్రానంతరం ప్రత్యేక తెలంగాణ పోరాట స్పూర్తిని కొనసాగించిన మహనీయుడని అన్నారు. ఆయన సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంటున్నదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పేరుమీద సాహిత్య అవార్డును సైతం అందజేస్తున్నారని తెలిపారు.