Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నర్సింగ్ అడ్మిషన్ల ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్‌లో పురుషులకు అవకాశం కల్పించకపోవడం పట్ల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నర్సులుగా పురుషులు పనికి రారా? ఇదేం వింత?, ప్రపంచం అంతా ఒక వైపు పోతుంటే మన తెలంగాణ కేసీఆర్ పాలనలో రాతి యుగం వైపు అంటూ ఆయన ట్విట్టర్లో విమర్శించారు. నర్సింగ్ అడ్మిషన్లలో పురుషులకు అవకాశం కల్పిస్తూ 2005లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2014 నుంచి యూనివర్సిటీ వర్గాలు మాత్రం పురుషులకు సీట్లు కేటాయించడం లేదు. దీనిపై గతంలో నర్సింగ్ సంఘాలు, మేల్ నర్సులు వైద్యారోగ్యశాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.