Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిజం విద్యార్థుల ముఖాముఖీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
హైదరాబాద్‌లోని సీటీ కాలేజీ జర్నలిజం విద్యార్థులు బుధవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణను కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ముఖాముఖి జరిగింది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా సంచలన విషయాలకు సినిమా క్రీడాకారుల వ్యక్తిగత విషయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదన్నారు. ఇలాంటి విషయాలకే టీఆర్‌పీ రేటింగ్ ఉంటున్నదని ప్రేక్షకులు కూడా విధానం ఏమైనప్పటికీ, సంపాదకుడికి ఉండే స్వేచ్ఛను వారు కోల్పోకూడదని ఆయన విశ్లేషించారు. అన్ని పత్రికల్లో జిల్లా సంచికలు రావటం వల్ల గ్రామీణ విలేకరుల ఆవశ్యకత పెరిగిందనీ, వీరికి తగిన వత్తిగత నైపుణ్యాలను అందించటం , వారి సంక్షేమ బాధ్యతలను నిర్వహించటంలో తెలంగాణ ప్రెస్ అకాడెమీ తగిన చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
గ్రామీణ విలేకరులలో భాషా పరమైన నైపుణ్యాలను పెంచటం కోసం మీడియా అకాడమీ ప్రత్యేకంగా వాచకాలను రూపొందించిందని అన్నారు . విద్యార్థులు తమ సొంత అభిప్రాయాలను వ్యక్తంచేయడానికి సామాజిక మాధ్యమాలను వినియోగించవచ్చన్నారు. వాటి ద్వారా వేగంగా భావజాల ప్రసారం సాగుతుందని అన్నారు . మీడియా , రాజకీయాలు తదితర అంశాలపై విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన చాలా ఓపిక సమాధానమిచ్చి ప్రెస్ అకాడమీ ప్రత్యేకంగా పాదకాలను అందించారు . ముఖాముఖీలో అల్లం నారాయణతో సంభాషించిన విద్యార్థులు ఈ కార్యక్రమం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సిటీ కళాశాల తెలుగు విభాగం ప్రెస్‌అకాడమీతో కలసి ' సజనాత్మక రచన ' సర్టిఫికేట్ కోర్సును నిర్వహించాలని ప్రతిపాదించగా , ఆయన ఆమోదం తెలిపారు సిటీ కళాశాల జర్నలిజం విద్యార్థులు హరిత , నందిని ఆకాష్ , శిరీష , నితిన్ , అక్షిత తదితరులతోపాటు కళాశాల సహాయ ఆచార్యులు డా . జె.నీరం , రా కోయి కోటేశ్వర రావు ముఖాముఖీలో పాల్గొన్నారు .