Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు చాడ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీఎస్సీ-2008 కామన్ మెరిట్ జాబితాలో ఎంపికై పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో నియామకాల ప్రక్రియ కొనసాగినందున అప్పుడు మిగిలిపోయిన అభ్యర్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా నియామకాలు చేపట్టి ఉద్యోగాలిచ్చిందని గుర్తు చేశారు. 2015లో కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తెచ్చినప్పుడు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. కావున డీఎస్సీ-2008 నోటిఫికేషన్ ప్రకారం కామన్ మెరిట్‌లో ఎంపికై నష్టపోయిన అభ్యర్థులందరికీ నియామకాలు చేపట్టాలనీ, ఉద్యోగాలిచ్చి న్యాయం చేయాలని కోరారు.