Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచాయతీ కార్యదర్శుల వినతి
- సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా : ఎర్రబెల్లి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'మమ్ముల్ని రెగ్యులరైజ్ చేయండి' అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును గ్రామ పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ (టీపీఎస్‌ఎఫ్) అధ్యక్షులు గౌరినేని రాజేశ్వర్‌రావు నేతృత్వంలో మంత్రిని కలిశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అవిరామంగా పనిచేస్తున్నారనీ, వారి సేవలను గుర్తించి, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. దీనిపై మంత్రి దయాకర్‌రావు సానుకూలంగా స్పందించారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరెడుగొండు మండలం, పీచర గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శి రాజ్ కుమార్ ఆర్‌ఓఎఫ్‌ఆర్ సర్వేలో భాగంగా విధులు నిర్వహించి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజ్ కుమార్ కు మెరుగైన వైద్య అందించాలని జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అనంతరం రాజ్ కుమార్ చేరిన ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడారు. రాజ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. లేకుండా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
మంత్రిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి శశిధర్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ఆకారపు సురేశ్, జాయింట్ సెక్రటరీ ప్రవీణ్, జనగామ జిల్లా అధ్యక్షులు గర్వందుల శ్రీకాంత్ గౌడ్, సంఘం ప్రతినిధులు లక్ష్మీనారాయణ, పథ్వి, శివ, భాస్కర్, పాషా, వినరు తదితరులున్నారు.