Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కనెక్షన్లు తొలగించారని..
నవతెలంగాణ- భువనగిరిరూరల్
విద్యుత్ కనెక్షన్లు తొలగించడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గౌస్‌నగర్ గ్రామస్తులు విద్యుత్ సిబ్బందిని బుధవారం గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో నాలుగు రోజుల కిందట వ్యవసాయ బావుల విద్యుత్ కనెక్షన్లను రైతులకు సమాచారం ఇవ్వకుండా అధికారులు తొలగించారు. దాంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సుమారు రెండు గంటలపాటు నిరసన వ్యక్తం చేసినా ఎవరూ రాకపోవడంతో విద్యుత్ సిబ్బందిని నిర్బంధించారు. అనంతరం భువనగిరి ఏఈ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని రైతులతో చర్చించారు. విద్యుత్ కనెక్షన్స్ పునరుద్ధరించారు. హెల్పర్ వెంకటరెడ్డి దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఏఈకి ఫిిర్యాదు చేశారు. సుమారు 40ఏండ్ల కిందటి నుంచి వినియోగంలో లేని బావుల కలెక్షన్లకు బిల్లులు చెల్లించాలని, దానికి సంబంధించిన వ్యక్తిని విచారించకుండా ఇతరుల విద్యుత్ కలెక్షన్లు తొలగించడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకోవాలని కోరారు.