Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టికెట్ బుకింగ్‌కు ప్రత్యేక యాప్
- బస్ ట్రాకింగ్ సదుపాయం త్వరలో అందుబాటులోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటీల్ బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి ప్రస్తుతం ఆఫీస్‌లకు చేరుకుంటున్నారనీ, ఈ ప్రత్యేక షటిల్ సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. షటీల్ సర్వీసుల ఏర్పాటు కోసం ఆన్‌లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్‌ఆర్టీసీ కోరింది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్‌లో ఐటీ కారిడార్‌లో మరిన్ని షటీల్ సర్వీసులను నడుపుతామని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలనుకునే ఐటీ ఉద్యోగులు shorturl.at/avCHI లింక్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఐటీ ఉద్యోగుల కంపెనీ వివరాలు, లోకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం ప్రత్యేక బుకింగ్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అలాగే బస్సు సర్వీసులు ట్రాకింగ్ సౌకర్యంతో పాటు బస్సు నెంబరు, డ్రైవర్, కండక్టర్ల ఫోన్ నెంబర్లు కూడా దీనిలో ఉంటుందని వివరించారు.