Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత విశేషాలతో తుమ్మల కల్పనారెడ్డి ఆయనపై రాసిన 'కట్ల పూలదడి' కవితా సంకలనాన్ని బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కే తారకరామారావు ఆవిష్కరించారు. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకుంటున్న ప్రస్థానానికి అద్దం పట్టే కవితలు ఈ సంపుటిలో ఉన్నాయనీ, భాష నిడికారపు సొంపు ప్రతి కవితలోను ప్రతిధ్వనిస్తుందని రచయిత తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, గాయకుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.