Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసింది. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు రెండో దశ కార్యక్రమం అమలులో భాగంగా వీరిని నియమించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా జరిగే ఈ నియామక ప్రక్రియ బాధ్యతను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ ఒకటిన విడుదల కానున్నది. ఐదో తేదీన ఇంటర్వ్యూ, 10న మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. కంటి వెలుగు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,491 వైద్య బృందాలను ఏర్పాటు చేయనున్నది.