Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు, విద్యార్థినిల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్టు టీపీటీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై అశోక్ కుమార్, ముత్యాల రవీందర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ సంచాలకులకు పలుసార్లు ప్రాతినిథ్యం చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. కేజీబీవీ ఉపాధ్యాయినిలు, బోధనేతర సిబ్బంది మౌలిక సమస్యలైన ఉద్యోగ భద్రత, కనీస వేతనం, రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా సెలవులు, ఖాళీల భర్తీ, విద్యార్థినులకు పౌష్టికాహారం, ట్రంక్ పెట్టెలు, దుప్పట్లు, ఇంటర్ చదివే వారికి యూనిఫారం సరఫరా, పాఠశాల వరకు సరుకులు అందించాలని డిమాండ్ చేశారు.