Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులను పక్కన పెట్టిన వైనం
- ఇంటర్వ్యూతో గట్టెక్కించిన అధికారి
- టీశాక్స్ నియామకలపై అనుమానాలు?
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక ఉదాత్త లక్ష్యం కోసం ఏర్పాటైన ఆ సొసైటీ తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నది. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ ను నిర్మూలించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ)ని నెలకొల్పారు. జాతీయ స్థాయిలో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో) పని చేస్తుండగా రాష్ట్రంలో టీశాక్స్ పని చేస్తున్నది. ఇందులో భాగంగా అధికారులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ బేస్‌డ్ ఆర్గనైజేషన్స్, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ లక్ష్యసాధన కోసం భాగస్వాములయ్యాయి. గత 30 ఏండ్లకు పైగా సొసైటీ సేవలందిస్తున్నది. అయితే గతంతో పాటు ఇటీవల ఈ సంస్థలో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీసాక్స్ స్థానంలో టీసాక్స్ ఏర్పడినప్పటికీ అక్కడ కొంత మంది అధికారులపై ఆరోపణలు మాత్రం ఆగకపోవడం గమనార్హం. స్వచ్ఛంద సంస్థలు పని చేయకపోయినా కోట్లాది రూపాయలు వారికివ్వడం వెనుక అధికారుల అవినీతి దాగుందని ఉద్యోగులు చర్చించు కుంటున్నారు. దీనికి తోడు గతేడాది హెడ్డాఫీసులో ఐసీటీసీ ఏడీ, సీఎస్‌డీ ఏడీ, టీఐ తదితర పోస్టుల కోసం నోటిఫి కషన్ ఇచ్చారు. అయితే ఈ పోస్టుల భర్తీలోనూ పారదర్శకత పాటించకుండా ప్రతిభావం తులను పక్కన పెట్టి తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటు న్నాయి. ఇక్కడికి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారిని కదలకుండా అక్కడే ఉండటం, ఇప్పటికే డిప్యూటేషన్ పై వచ్చిన వారంతా మాతృ సంస్థలకు వెళ్లాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం కూడా ఈ వ్యవస్థ గాడి తప్పిం దనేందుకు అద్దం పడుతున్నది. పోస్టుల భర్తీలకు సంబంధించి రాత పరీక్షల్లో ఎక్కువ మార్కు లు వచ్చిన వారిని కాదనీ, ఇంటర్వ్యూ పేరుతో తమకు నచ్చిన వారిని ఎంపిక చేశారని ఆ సొసైటీలో పని చేస్తున్న సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. టీఐ పోస్టుకు అప్పటికే ఆ సొసైటీలో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సదరు వ్యక్తి రాత పరీక్ష తేదీ, సమయానికి సంబంధించిన సమాచారం తెలియకుండా డమ్మీ మెయిల్‌ను సష్టించి తప్పుదారి పట్టించినట్టు తెలుస్తున్నది. స్టాఫ్ నర్సు నియామకానికి సంబంధిం చి కూడా రాతపరీక్షను కాదనీ, ఇంటర్వ్యూ పేరుతో అర్హులకు అన్యాయం చేసినట్టు సమాచారం. ఇప్పటికైనా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ జోక్యం చేసుకుని మొత్తం నియామక ప్రక్రియపై దర్యాప్తు జరగాలని అభ్యర్థులు కోరుతున్నారు.